Miryalaguda : 4న మిర్యాలగూడకు రేవంత్ రెడ్డి రాక.. గూడూరు వద్ద బహిరంగ సభ..!
ఈనెల 4 న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ (రూరల్) పర్యటన సందర్బంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.

Miryalaguda : 4న మిర్యాలగూడకు రేవంత్ రెడ్డి రాక.. గూడూరు వద్ద బహిరంగ సభ..!
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
మిర్యాలగూడ, మన సాక్షి :
ఈనెల 4 న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ (రూరల్) పర్యటన సందర్బంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఆయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి మిర్యాలగూడ సమీపంలోని గూడూరు వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్న బహిరంగ సభ, హెలిపాడ్ , తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని, బహిరంగ సభ వేదిక, బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు కుర్చీలు, తాగునీరు, బ్యారికేడింగ్, అభివృద్ధి కార్యక్రమాల శిలా ఫలకాలు, తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.
బహిరంగ సభకు వచ్చే అప్రోచ్ రోడ్లు, హెలిప్యాడ్, బ్యారికేడింగ్, భద్రత తదితర అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వివిధ శాఖలకు కేటాయించిన విధులను తూ.చా తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మిర్యాలగూడ డి ఎస్ పి రాజశేఖర్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీధర్ రెడ్డి ,డిపివో శంకర్ నాయక్,స్థానిక మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు, ఉన్నారు.
MOST READ
-
NLG : రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!
-
Rythu Bharosa : రైతు భరోసా శాటిలైట్ సర్వే పూర్తి.. షాకింగ్ నిజాలు, లేటెస్ట్ అప్డేట్..!
-
BREAKING NEWS : గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..!
-
Gold Price : మళ్లీ వేలల్లో పడిపోయిన పసిడి.. భారీగా దిగివచ్చిన ధర..!










