మిర్యాలగూడ : జనావాసాల మధ్యే టన్నుల కొద్దీ బాంబుల నిల్వలు…!

మిర్యాలగూడ పట్టణంలోనే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమది. బడా షాపింగ్ మాల్స్ తో ఏర్పాటుతో పాటు ఇతర దుకాణాలు ఉండే హనుమాన్ పేట...ప్రధాన రహదారికి పక్కన్నే టపాసుల విక్రయ దుకాణాలను ఏర్పాటు చేసిండ్రు కొంత మంది వ్యాపారులు.

మిర్యాలగూడ : జనావాసాల మధ్యే టన్నుల కొద్దీ బాంబుల నిల్వలు…!

షాపింగ్ మాల్స్ పక్కనే బాంబుల దుకాణాల ఏర్పాటు…!

మామూళ్లు పంచేసి…వ్యాపారం ప్రారంభించినట్లు…ప్రచారం చేసుకుంటున్న ఓ హోల్ సేల్ వ్యాపారి…!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ పట్టణంలోనే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమది. బడా షాపింగ్ మాల్స్ తో ఏర్పాటుతో పాటు ఇతర దుకాణాలు ఉండే హనుమాన్ పేట…ప్రధాన రహదారికి పక్కన్నే టపాసుల విక్రయ దుకాణాలను ఏర్పాటు చేసిండ్రు కొంత మంది వ్యాపారులు. సుమారు 20 బాంబుల షాపుల ఉండగా…ఇందులో టన్నుల కొద్దీ బాంబుల నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం… షాపుల మద్య డిస్టెన్స్ ఉండాలి. ఇవన్నీ పక్కన పెట్టి కనీస ఫైర్ సేఫ్టీ చర్యలను చేపట్టకుండా ఓ హోల్ సేల్ వ్యాపారి సూత్ర దారిగా వ్యవహరించి… అడ్డ దారిలో పర్మిషన్స్ దక్కించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ALSO READ : కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ విడుదల.. మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్..!

మామూళ్లను పంచేసి …బాంబుల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నామని… ఓ హోల్ సేల్ వ్యాపారి ప్రచారం చేసుకుంటున్నారు. రూ. 25,500 మామూళ్ల ను ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు ఆ హోల్ సేల్ వ్యాపారి. మున్సిపాలిటీ శాఖకు ఇచ్చే విషయమై బేరం సెట్ కాలేదని…ఆ హోల్ సేల్ వ్యాపారి అతని సన్నిహితులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.

ALSO READ : భర్తను హత్య చేసిన భార్య.!

ప్రమాదం జరిగితే..బాధ్యత ఎవరిది…?

మిర్యాలగూడ పట్టణంలోని…హనుమాన్ పేట వద్ద జన నివాసాల మద్య బాంబుల దుకాణాలను ఏర్పాటు చేసిండ్రు. అయితే ఇక్కడ చెన్నై, జీవీ మాల్, సీఎం ఆర్, ఇతర గోల్డ్ దుకాణాలు ఉన్నాయి. బాంబుల నిల్వ ఉన్న ప్రాంతం నుంచి సుమారు 500 మీటర్ల వరకు ప్రధాన రహదారి పై ఉదయం నుంచి రాత్రి 9.30 గంటల వరకు .. వేలాదిగా ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.

పెద్ద ఎత్తున టపాసుల నిల్వలు ఉన్నప్పటికీ అధికారులు సేఫ్టీ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం పై అనుకోని ప్రమాదం జరిగితే… ఎవరూ బాధ్యత వహించాలని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ జనావాసాల మద్య టపాసులను ఏర్పాటు చేయటమే కాకుండా… మిర్యాలగూడ మండలంలో బాంబుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసిండ్రు.

ఈ తరుణంలో…బాంబుల దుకాణాలు, తయారీలో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా…ముందుస్తు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కాగా బాంబుల విక్రయాల షాపుల డీటెయిల్స్ పర్మిషన్ల వివరాలపై ఫైర్ సేఫ్టీ అధికారి యాదగిరిని వివరణ కోరగా… తమ వద్ద ఎలాంటి వివరాలు లేవని  చెప్పటం విశేషం.

ALSO READ : మిర్యాలగూడ : టపాకాయల వ్యాపారుల మధ్య వివాదం.. గొడ్డలితో దాడి..!