మిర్యాలగూడ : హౌసింగ్ బోర్డ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద భారీ క్యూ..!

మిర్యాలగూడ : హౌసింగ్ బోర్డ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద భారీ క్యూ..!

ఘనంగా ముక్కోటి ఏకాదశి పూజలు

మిర్యాలగూడ, మన సాక్షి :

ధనుర్మాచోత్సవంలో భాగంగా ముక్కోటి ( వైకుంఠ) ఏకాదశి పూజలు శనివారం ఘనంగా జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది.

తెల్లవారు జామున 4.30 గంటల నుంచి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దేవాలయం తో పాటు రోడ్డుపైకి కూడా భారీగా భక్తులు క్యూ లైన్ లో వెళ్తున్నారు.

భక్తులు స్వామివారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను ఆలయ కమిటీ అందజేస్తుంది.

ALSO READ : Bigg Boss : బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్..!