Bigg Boss : బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్..!

బిగ్ బాస్ -7 రియాలిటీ షో విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ లోని కొల్లూరులో ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు

Bigg Boss : బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్..!

మన సాక్షి , హైదరాబాద్ :

బిగ్ బాస్ -7 రియాలిటీ షో విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ లోని కొల్లూరులో ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బిగ్ బాస్ 7 ఫినాలే సందర్భంగా ఫ్యాన్స్ చేసిన వీరంగం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫ్యాన్స్ చేసిన విధ్వంసాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారణ చేశారు. ఈ ఘటనలో సంబంధం ఉన్న వారందరిపై కేసులు పెడుతున్నారు.

పల్లవి ప్రశాంత్ ను కూడా వదలకుండా కేసు పెట్టారు. పల్లవి ప్రశాంత్ ను ఏ 1గా, అతని తమ్ముడు మనోహర్ ను ఏ 2గా కేసు నమోదు చేశారు.

ALSO READ : Bigg Boss : బిగ్ బాస్ షోపై తెలంగాణ హెచ్ఆర్సీకి ఫిర్యాదు..!

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ నిలిచాడాన్ని వార్త ముందుగానే బయటకు రావడంతో చాలామంది ఫ్యాన్స్ హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు తరలివచ్చారు.

అదే సమయంలో బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ అమర్ దీప్ ఫ్యాన్స్ కూడా అక్కడికి భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదం జరిగింది. రోడ్డుపైనే కొట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. దాంతో ఆర్టీసీ ఎండి సజ్జనార్ ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

ALSO READ : అసెంబ్లీలో హరీష్ రావుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..!

దాంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేసి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ విధ్వంసం చేసినట్లుగా గుర్తించారు.

ఏ1 గా పల్లవి ప్రశాంత్ , ఎ 2గా అతని తమ్ముడు మనోహర్, ఏ3 గా మరో స్నేహితుడు పేరును నమోదు చేశారు. తాజాగా ఇద్దరు డ్రైవర్లను కూడా అరెస్టు చేశారు. విధ్వంసానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ల ఆధారంగా ఇంకా అరెస్టులు చేయనున్నారు.

ALSO READ : Gas cylinder : తెలంగాణలో గ్యాస్ సిలిండర్ రూ. 500 లకే.. ఆ రోజు నుంచే అమలు..!