Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందిరమ్మ ఇంటి ఒరిజినల్ పట్టా అందజేత..!

మిర్యాలగూడ పట్టణం 6వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన పులిపలుపుల నాగలక్ష్మి భర్త శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి 2008లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, ఇంతకాలం ఒరిజినల్ పట్టా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Miryalaguda : 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందిరమ్మ ఇంటి ఒరిజినల్ పట్టా అందజేత..!

మిర్యాలగూడ,మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణం 6వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన పులిపలుపుల నాగలక్ష్మి భర్త శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి 2008లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, ఇంతకాలం ఒరిజినల్ పట్టా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ సమస్య పరిష్కారం కోసం మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సహకారంతో తో 6వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్య రాంబాబు ప్రత్యేక చొరవతో అధికారులతో సమన్వయం చేసి పట్టా మంజూరయ్యేలా కృషి చేశారు.

ఎట్టకేలకు పట్టా అందడంతో రెడ్డి కాలనీ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే లు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు ఒరిజినల్ పట్టాను అందజేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను పరిష్కరించిన నల్లమోతు భాస్కర్ రావుకి లబ్ధిదారురాలు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమములో తెలంగాణ ఉద్యమ నాయకులు ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి.ఇలియాస్ ఖాన్, 28 వ వార్డు కౌన్సిలర్ గంగుల బిక్షం యాదవ్, 16 వ వార్డు ఇంచార్జ్ మన్నెం శ్రీనివాస రెడ్డి, 25 వ వార్డు నాయకులు పందిరి వేణు, 6 వ వార్డు బిసి సెల్ అధ్యక్షులు పులిపలుపుల శ్రీనివాస్ గౌడ్,6 వ వార్డు మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ ఫయాజ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు