Miryalaguda : ప్రయోజనం లేని పనులకు ప్రజాధనం దుర్వినియోగం..!

గత పాలకులు ప్రజాసంక్షేమం కంటె ఓట్లను పొందడానికి ప్రజాకర్షణ కోసం అనేక ప్రజాప్రయోజనం లేని అనేక ఉత్త్తుత్తి పనులు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రజలకు అనేక నష్టాలు కొని తె చ్చారు. అందులో రాష్ట్ర స్థాయి లో కాళేశ్వరం పరాకాష్ట అయితే. కింది స్థాయిలో అనేకం జరిగాయి.

Miryalaguda : ప్రయోజనం లేని పనులకు ప్రజాధనం దుర్వినియోగం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

గత పాలకులు ప్రజాసంక్షేమం కంటె ఓట్లను పొందడానికి ప్రజాకర్షణ కోసం అనేక ప్రజాప్రయోజనం లేని అనేక ఉత్త్తుత్తి పనులు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రజలకు అనేక నష్టాలు కొని తె చ్చారు. అందులో రాష్ట్ర స్థాయి లో కాళేశ్వరం పరాకాష్ట అయితే. కింది స్థాయిలో అనేకం జరిగాయి. ప్రజాప్రతినిధుల తిక్కవేషాలకు తలోగ్గి అధికారులు తమ బాధ్యతలు విస్మరించి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తడం వళ్ల అనేక అవకతవకలు జరిగి ప్రజా ధనం దుర్వినియోగం జరగడమే కాకుండా ప్రజలకు తీవ్రమైన కష్ట నష్టాలు కూడా కలిగించారు. ప్రాణాపాయలు కూడా జరిగాయి.

మొన్నటి శాశనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఓట్ల కక్కుర్తి తో చేసిన పనుల్లో మిర్యాలగూడ రోడ్ల విస్తరణ లో భాగంగా రోడ్ల మధ్యలో డి వై?డర్ ల పేరు తో చేసిన నిర్మాణాలు అస్తవస్థoగా ఉండడమే కాకుండా… ప్రయాణికులకు తీవ్ర మైన ఇబ్బందులు కలిగిస్తున్నాయి.. ప్రమాదాలు జరుగుతున్నాయి. మిర్యాలగూడ లోని ఈదులగూడ, రాజీవ్ చౌక్, తడ్కమళ్ల, నల్లగొండ బైపాస్ చౌరస్తా ల లో ఏర్పాటు చేసిన డిజై న్లు అన్నీ కూడా అనవసరమైనవి, అసౌకర్యమవడమే కాకుండా ప్రాణాoత కమైనవి..

తలతోక లేని వీటి వళ్ళ ప్రజాధనం దుర్బీనియోగ మైనవి. రోడ్లు తగినoత విస్తరించకుండా డిజైన్స్ హడా వుడిగా చేయడం కేవలం ఎన్నికలను ద్రుష్టి లో పెట్టుకుని ప్రజల ఓట్ల కోసం చేసిందే. నాలుగురోడ్ల కూడలి లో పూర్వం వలయాకారం ఏర్పాటు చేసేవారు. కానీ ఇవాళ ఆధునిక ఆలోచన తో అది విరమించి యుటర్లు ఏర్పాటు చేయాల్సింది పోయి ఇలా అడ్డగోలుగా చేసారు. నిపుణు లు చేయాల్సిన రూపాకల్పనలు రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులు చేయడం గత పాలన లో ఎక్కువైంది.

ALSO READ : NREGS : ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్..?

నల్లగొండ బైపాస్, తడకమళ్ళచౌరస్తా, ఈదులగూడ చౌరస్తా ఇవి మూడు కూడా టి జంక్షన్ లు. ఇక్కడ వలయాకారాలు ఏర్పాటు చేయడం ఆశాస్త్రీయం, సాoకేతికంగా చాలా తప్పు. నల్లగొండ బైపాస్ లో అయితే మరీ దారుణం జాతీయ రహదారిని ఆక్రమించి మరి డిజైన్ చేసారు. పాదాచారులకు బాట వదలకుండా..

తడకమళ్ళ చౌరస్తాలో అయితే పూర్తిగా ఒక వైపు ముసివేశారు. ఇక ఈదులగూడెం అయితే అస్తవస్థo. రాజీవ్ చౌక్ మరీ దారుణం. నాలుగు వైపులా విస్తరంచకుండా ప్రమాదకర గోడ కట్టేసారు. మిర్యాలగూడ లో ఈ నాలుగు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఆశస్త్రీయంగా నిర్మించిన కట్టడాలను (పడగొట్టి )తొలగొంచి యూటర్న్ లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

సాగర్ రోడ్డు లో ప్లై ఓవర్ దగ్గర నుండి వెంకటాద్రి పాలెం వరకు లారీ అసోసియేషన్ వాళ్ళు ఏడాది లో 365 రోజులు 24 గంటలు లారీలు నిలిపి ఉంచుతున్నారు. దీనివల్ల ప్రయాణికులకు, బాటసారులకూ, దుకాణ దారులకు, నివాసాల వారికి చాలా ఇబ్బందులు అవుతున్నవి. సీసీ కెమెరాలు పెట్టి జూరిమానా విధించాలి. వీటిని తొలగించాలి. అధికారులు ప్రలోభాలకు లొంగకుండా సాంకేతిక విషయాల్లో తమ పని తాము చేయాలి.

ఈ డిజైన్ల ను రూపొందిన వారిని, వాటిని ఆ మోదించిన వారిని శిక్షించడమే కాకుండా అవి కట్టడానికి అయిన ఖర్చులు, ఇప్పుడు వాటిని పడగొట్టాడానికి అయ్యే ఖర్చు లు వాళ్ళనుంచి వసూలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అవసరం అయితే న్యాయ పోరాటం చేస్తాo. పురపాలక కమిషనర్, రాజస్వ మండలాధికారి శానసభ్యులు ల దృష్టికి తీదుకుపోవడం జరుగు తుంది.

తెలంగాణ మట్టి మనుషుల వేదిక

వేనేపల్లి పాండురంగారావు,
జ్వాల వెంకటేశ్వర్లు.

ALSO READ : Dubbaka : చైన్ స్నాచింగ్ కేసును టెక్నాలజీతో చేదించి నిందితుడు అరెస్ట్..!