Dubbaka : చైన్ స్నాచింగ్ కేసును టెక్నాలజీతో చేదించి నిందితుడు అరెస్ట్..!

చైన్ స్నాచింగ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసే రిమాండ్ చేసినట్లు సీఐ పి. శ్రీనివాస్ తెలిపారు.

Dubbaka : చైన్ స్నాచింగ్ కేసును టెక్నాలజీతో చేదించి నిందితుడు అరెస్ట్..!

దుబ్బాక, మనసాక్షి :

చైన్ స్నాచింగ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసే రిమాండ్ చేసినట్లు సీఐ పి. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… సర్కిల్ పరిధిలోని భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎనగుర్తి గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద కల్లు అమ్ముకుంటున్న కోయాడ యాదమ్మ, గ్రామం ఎనగుర్తి, ఆమె మెడ లోని బంగారు పుస్తెళ్తాడు 2 .1/2 తులాలు ను బెదిరించి బలవంతంగా గుంజుకొనీ పోయిన విషయంలో ఈ నెల 14 న సాయంత్రం పిర్యాదు రావడం జరిగింది.

కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది. సిద్దిపేట ఏసిపి మధు, పర్యవేక్షణలో దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దుబ్బాక సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీమ్స్ నూతన టెక్నాలజీ మరియు సిసి కెమెరాలు ద్వారా పై నేరస్తుని గుర్తుపట్టి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. పై నిందితుడు ఆన్లైన్ లోని లోన్ ఆప్స్ ద్వారా డబ్బులు తీసుకొని వాటిని కట్టడం ఇబ్బంది జరిగినది.

లోన్ వారు రెగ్యులర్ గా ఫోన్స్ చేయడం తో ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యం తో ఆలోచించి మొబైల్ ఫోన్ లోని యూట్యూబ్ లో చైన్ స్నాచింగ్ గురించి సెర్చ్ చేసి ఈ నేరానికి పాల్పటాడం జరిగినది. ఈ నెల 17 సాయంత్రం 6 గంటలకు పై నేరస్తుని అరెస్టు చేసి విచారించగా తను చేసిన నేరం ఒప్పుకొని అతని వద్ద ఉన్న 2. 1/2 తులాల పుస్తెలా తాడు, బైక్, ఫోన్, రికవరీ చేసి పై నిందితున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని తెలిపారు.

పై కేసును చాకచక్యంగా చేదించిన దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజు, మిరుదొడ్డి ఎస్ఐ పరశురాం, క్రైమ్ పార్టీ సిబ్బంది సాయికృష్ణ, రాజి రెడ్డి, రాంజీ రాంజీ గార్లను పోలీస్ కమిషనర్ అభినందించారు త్వరలో రివార్డు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ…. ఆన్లైన్ లోన్ యాప్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోను తీసుకోవద్దు లోను తీసుకుని ఎవరైనా ఇబ్బందులకు గురైతే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వాలి లేదా జాతీయ సైబర్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. లోన్ యాప్ లో లోన్ తీసుకొని నేరాలకు పాల్పడ్డ వారు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో లోన్ తీసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎస్సై గంగరాజు, తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!