దుబ్బాక | పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. నిర్లక్ష్యంపై ఆగ్రహం..!

దుబ్బాక | పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. నిర్లక్ష్యంపై ఆగ్రహం..!

దుబ్బాక, మనసాక్షి :

దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

 

పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీసిన ఎమ్మెల్యే, దుబ్బాక మండలం హబ్సిపూర్ ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న సంపు పనులను పరిశీలించారు. నిరుపయోగంగా ఉన్న సంపుపై పైకప్పు వేయడంలో నిర్లక్ష్యం చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ALSO READ:

 

స్వయంగా తానే దగ్గరుండి తన సహాయ సిబ్బంది మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రమాదకరంగా నిరుపయోగంగా ఉన్న సంపుపై పై కప్పును పెట్టించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, స్కూలు ప్రారంభమైన చిన్నపిల్లలకు ఇబ్బందికరంగా ఉన్న సంపు మరియు ఇతర నిర్మాణ పనులలో నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు స్థానికులను అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయుల రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, బిజెపి నాయకులు బాలేష్ గౌడ్, పుట్ట వంశి, తోపాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.