Development : నియోజకవర్గ అభివృద్ధికి ఒక శ్రామికుడిలా పని చేస్తా..!

అశ్వరావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు.

Development : నియోజకవర్గ అభివృద్ధికి ఒక శ్రామికుడిలా పని చేస్తా..!

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

దమ్మపేట రూరల్, మన సాక్షి :

అశ్వరావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం దమ్మపేట మండలంలోని గండుగులపల్లి గ్రామంలోని జారే ఆదినారాయణ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జరిగిన ప్రగతి నివేదికను వెల్లడించారు.

నియోజకవర్గంలో రూ.8.5 కోట్ల ఎన్అర్ జీఎస్ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు, రూ.10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రూ.2 కోట్ల నిధులతో పాఠశాలల అభివృద్ధి చేస్తున్నామని, మీచౌంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వాటికి తొమ్మిది కోట్లు నిధులు తీసుకొచ్చామని తెలిపారు.

మార్చి నెలలో దమ్మపేట మండల కేంద్రంలో కోర్ట్ ప్రారంభం కాబోతుందని, త్వరలోనే అశ్వారావుపేట లేదా దమ్మపేట మండలాల్లో రూ.3.5 కోట్ల నిధులతో ఇండోర్ మినీ స్టేడియం నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తునట్టు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్, సొసైటీ చైర్మన్ ఎల్లిన రాఘవరావు, రాష్ట్ర ఆయిల్ ఫామ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మద్దిశెట్టి సత్య ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కేవీ సత్యనారాయణ, కాసాని నాగప్రసాద్, ఎర్రగొర్ల రాధాకృష్ణ, కక్కిరాల రమేష్, అత్తులూరి వెంకట రామారావు, మడకం రాజేష్ తదితరులు పాల్గొన్నారు