BIG BREAKING : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..!
BIG BREAKING : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..!
హైదరాబాద్, మన సాక్షి :
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. హైదరాబాద్ లోని పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొనడంతో మృతి చెందారు. ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఆకాష్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
కాంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత. ఆమె మాజి ఎమ్మెల్యే దివంగత సాయన్న కూతురు.
2015లో రాజకీయాల్లోకి లాస్య నందిత వచ్చారు.
2015 కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.
2016లో తండ్రి సాయన్నతో పాటు టిఆర్ఎస్ లో చేరారు.
2016లో కవాడిగూడ నుంచి కార్పోరేటర్ గా లాస్య నందిత గెలుపొందారు.
2011లో కవాడిగూడ నుంచి లాస్య నందిత కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు.
2023లో కంటోన్మెంట్ అసెంబ్లీ నుంచి విజయం సాధించారు.
ఇటీవలనే నల్లగొండ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా కూడా ఆమెకు ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలతో బయటపడిన ఆమె ఇటీవలనే కోల్కున్నారు.
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలుపుతూ ట్వ్ ట్ చేశారు.









