TG News : అందరి ముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. వైరల్ అవుతున్న వీడియోలు..!
TG News : అందరి ముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. వైరల్ అవుతున్న వీడియోలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కరీంనగర్ కలెక్టరేట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరగడంతో పాటు ఒకరినొకరు తోపులాట కూడా చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు.
సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ అంటూ కౌశిక్ రెడ్డి నిలదీయడంతో గొడవ మొదలైంది. దీంతో ఒకరికి ఒకరు దూసుకురాగా అక్కడ ఉన్న వారంతా అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆగకుండా కౌశిక్ రెడ్డి ముందుకు తీసుకెళ్లడంతో ఇద్దరి మధ్య తోపురాటం జరిగింది. పరస్పరం చేయి చేసుకున్నారు.
దాంతో కౌశిక్ రెడ్డిని బలవంతంగా పోలీసులు బయటకు తీసుకెళ్లారు. సమావేశంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. కాగా వివాదానికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి.
కేసీఆర్ పెట్టిన భిక్షతోనే గెలిచి సిగ్గులేకుండా పార్టీ మారారని సంజయ్ పై కౌశిక్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డాడు. అన్నం తింటుండా..? లేక పెండ తింటుండా..? దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలమని సవాల్ చేశాడు. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశాడు.
కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా మైక్ గుంజుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
సంజయ్‌ను "ఒరేయ్ ఏ పార్టీరా నీది" అంటూ సంబోధించిన కౌశిక్ రెడ్డి pic.twitter.com/yqoI3e0FWq
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2025
MOST READ :
-
Additional collector : కొత్త పథకాల ఎంపికకు ఇవీ మార్గదర్శకాలు.. అదనపు కలెక్టర్..!
-
Rythu Bharosa : రైతు భరోసా అర్హతకు రూల్స్ విడుదల.. మీరు అర్హులేనా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై విద్యాశాఖ కీలక నిర్ణయం..!
-
TG News : 26 నుంచి 4 పథకాలు ప్రారంభం.. మీరు అర్హులేనా..!
-
Scam : డబ్బులు వచ్చాయని సంబరపడి ఎకౌంట్ చెక్ చేసుకుంటే.. కొత్త రకం స్కాం, వెంటనే తెలుసుకోండి..!
-
Gold Price : హ్యాట్రిక్ కొట్టేసిన గోల్డ్.. ధర ఎంతో తెలుసా..!









