ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజులకు క్షమాపణలు చెప్పాలి

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజులకు క్షమాపణలు చెప్పాలి

చౌటుప్పల్. మన సాక్షి.

ముదిరాజులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఉంటే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాత్రం ముదిరాజుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు పాశం సంజయ్ బాబు అన్నారు.

 

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మతో చౌటుప్పల్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.

 

Also Read : Kcr Govt Record : కెసిఆర్ సర్కార్ మరో రికార్డ్ .. ఆసియాలోనే అతిపెద్ద కాంప్లెక్స్, అదిరిపోయేలా సౌకర్యాలు..!

 

అనంతరం ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు పాశం సంజయ్ బాబు మాట్లాడుతూ ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్,ముదిరాజ్ తల్లి పాలు తాగి పెరిగానని చెప్తూ ముదిరాజ్ లను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముదిరాజుల అభివృద్ధికి కృషి చేస్తూ వారికి అత్యున్నత పదవులు కేటాయిస్తూ ఉంటే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజ్ లను అవహేళన చేస్తూ, అసభ్య పదజాలలను మాట్లాడుతూ యావత్ ముదిరాజ్ జాతిని అవమానించడం బాధాకరం అన్నారు.

 

కౌశిక్ రెడ్డి వెంటనే ముదిరాజ్ జాతికి క్షమాపణలు తెలపాలని లేదంటే గ్రామాల్లో తిరగనియ్యకుండా చేస్తాం అని హెచ్చరించారు.

 

Alfo Read : Forest Jobs : టెన్త్, ఇంటర్ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం..!

 

ఈ కార్యక్రమంలో జింకల కృష్ణ, కానుగుల శేఖర్, యాట రమేష్,దేప శ్యాంసుందర్, పాశం రవితేజ,బోబ్బిల రాజేందర్,ఎలమోని శ్రీకాంత్, సోప్పరి మల్లేష్,గుండ్ల శివ, బోబ్బిల శుభాష్,కొరివి శేఖర్,నిరుడు వెంకటముర్లి,దుర్గం శివ,అన్యలపు నరేష్, సోప్పరి మల్లేష్,పోలమోని శ్రీకాంత్,దేప నారేష,జంగం వెంకటేష్, సోప్పరి శంకర్,పాశం యుగంధర్,సున్నపు విష్ణు, తదితరులు పాల్గొన్నారు.