మిర్యాలగూడలో భారీగా ఫ్రీడం ర్యాలీ – Latest news

మిర్యాలగూడలో భారీగా ఫ్రీడం ర్యాలీ

ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కరరావు

పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తిరనగరు బార్గవ్, డిఎస్పి వెంకటేశ్వరరావు, బి ఎల్ ఆర్

మిర్యాలగూడ, ఆగస్టు 11, మనసాక్షి : స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ 2కే రన్ ర్యాలీ నిర్వహించారు. మిర్యాలగూడలోని ఎన్ఎస్పి క్యాంపు మైదానంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం 2 కె రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఎన్ఎస్పి క్యాంపు మైదానం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు వందలాదిమంది జాతీయ జెండా చేబుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : సూర్యాపేట : ఫ్రీడమ్ రన్ లో స్పృహతప్పి పడిపోయిన జిల్లా అటవీ అధికారి

ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, డిఎస్పి వెంకటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మండల విద్యాధికారి బాలాజీ నాయక్,మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరమణ చౌదరి (బాబి), మిర్యాలగూడ వన్ టౌన్, టూటౌన్ సిఐలు శ్రీనివాస్, సురేష్, టిఆర్ఎస్ నాయకులు వింజం శ్రీధర్, లక్ష్మీనారాయణ, సాదినేని శ్రీనివాసరావు, గుడిపాటి సైదులు బాబు, గయాస్, షోయబ్, దినేష్, పీఈటి వెంకటేశ్వర్లు,

ALSO READ : మిర్యాలగూడ : గుర్తు తెలియని మహిళ మృతి ( చనిపోయే ముందు వీడియో)

బంజారా ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరథ్ నాయక్, అదే విధంగా ఫ్రీడం రన్ లో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి( బిఎల్ఆర్) పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, జానీ, గంధం రామకృష్ణ, రవి నాయక్, కాంగ్రెస్ నాయకులు మోహిజ్, వన్ టౌన్ టూ టౌన్ ఎస్సైలు, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల, నాయకులు, వివిధ సంఘాల నాయకులు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.