డబ్బులు ఎలా తరలిస్తున్నారో.. తెలిస్తే షాక్..!

ఎంతో తెలివిగా వ్యవహరించి రూ.10 లక్షలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం దమ్మపేట మండల కేంద్రంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వేడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

డబ్బులు ఎలా తరలిస్తున్నారో.. తెలిస్తే షాక్..!

దమ్మపేట రూరల్, మన సాక్షి :

ఎంతో తెలివిగా వ్యవహరించి రూ.10 లక్షలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం దమ్మపేట మండల కేంద్రంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వేడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌ వెళ్తుండగా వారిపై అనుమానం వచ్చి పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఆ ఇద్దరిని తనిఖీ చేయగా ఇరువురు నడుముకు రూ.5 లక్షల చొప్పున కట్టుకుని రూ.10 లక్షలను తరలిస్తున్నారు.

ALSO READ : బర్రె లక్క.. మెరుపు లెక్క, నిరుద్యోగులకు ఆదర్శం అయ్యేనా..!

ఆ డబ్బుల వివరాలు అడగ్గా సరైన సమాధానం చెప్పకపోగా.. ఎలాంటి రశీదులు చూపించకపోవడంతో సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదును దమ్మపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ALSO READ : మిర్యాలగూడ : ఇద్దరి మధ్య బిగ్ ఫైట్.. గెలిచేది అతడేనా..!