బర్రె లక్క.. మెరుపు లెక్క, నిరుద్యోగులకు ఆదర్శం అయ్యేనా..!

తెలంగాణ లో యువత చైతన్యంతో ఉంటారని బర్రెలక్క శిరీష నిరూపించింది. ఉద్యమాల తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న యువత ఉద్యోగాలు సాధించుకోలేకపోతున్నారని బర్రె లెక్క ఎదురు తిరిగింది. సామాన్య కుటుంబంలో పుట్టిన బర్రెలక్క డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా.. నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుత్సాహానికి గురి అయింది. అంతలోనే నాలుగు బర్రెలు కొనుక్కొని కేవలం ఇన్ స్టాగ్రామ్ లో బర్రెలక్కగా పేరు సంపాదించుకుంది.

బర్రె లక్క.. మెరుపు లెక్క, నిరుద్యోగులకు ఆదర్శం అయ్యేనా..!

హైదరాబాద్ , మనసాక్షి :

తెలంగాణ లో యువత చైతన్యంతో ఉంటారని బర్రెలక్క శిరీష నిరూపించింది. ఉద్యమాల తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న యువత ఉద్యోగాలు సాధించుకోలేకపోతున్నారని బర్రె లెక్క ఎదురు తిరిగింది. సామాన్య కుటుంబంలో పుట్టిన బర్రెలక్క డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా.. నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుత్సాహానికి గురి అయింది. అంతలోనే నాలుగు బర్రెలు కొనుక్కొని కేవలం ఇన్ స్టాగ్రామ్ లో బర్రెలక్కగా పేరు సంపాదించుకుంది.

అదెలానంటే ప్రభుత్వం మీద నిరుద్యోగ యువతల్లో ఉన్న వ్యతిరేకతను కేవలం నాలుగు వాక్యాల్లో వివరించి చరిత్ర సృష్టించింది. ఉద్యోగాలు లేక బర్రెలు కాసుకుంటున్నాను.. నోటిఫికేషన్లు రావడం లేదనేది.. ఆమె సారాంశం. దాంతో ఆమె చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఆమెపై పోలీసులు సుమోటోగా కేసు పెట్టడం, ఆమె మరింత చైతన్యవంతురాలయింది.

ALSO READ : పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్.. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం..!

ఈ సంఘటన జరిగి రెండు సంవత్సరాలు గడిచినా.. ఆమె మాత్రం చైతన్యం మరింత పెంచుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. నిరుద్యోగ యువత గుండెల్లో ధైర్యం నింపింది. గెలుపు ఓటములు ఎలా ఉన్నప్పటికీ అక్కడ అధికార, ప్రతిపక్ష నాయకుల కు దడ పుట్టే విధంగా ప్రచారం సాగించింది.

ALSO READ : Political News : తెలంగాణ ఆ పార్టీకి పేటెంటా.. పార్టీ పేరులోనే తెలంగాణ పదం తొలగించిన వారికా, మరి ఎవరికి..!

ఆదర్శం అయ్యేనా..?

ఈ ఎన్నికల్లో ఓ నిరుద్యోగ యువతి సామాన్య కుటుంబంలో పుట్టి నిరుద్యోగ యువతను మేల్కొల్పే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత బర్రెలక్కను ఈ ఎన్నికల్లో ఆదర్శంగా తీసుకుంటారా..? లేదా..? అనేది వేచి చూడాలి. నిరుద్యోగ యువత అంతా బర్రెలక్క మాదిరిగా చైతన్యం వచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేక పోయినప్పటికీ.. తమ ఓటు ద్వారా బర్రెలక్కను ఆదర్శంగా తీసుకొని చైతన్యం చూపిస్తారని నిరుద్యోగులు భావిస్తున్నారు.

ALSO READ : మిర్యాలగూడ : ఇద్దరి మధ్య బిగ్ ఫైట్.. గెలిచేది అతడేనా..!

అదే జరిగితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి తీర్పు ఇవ్వబోతున్నారు. ఎవరికి నిరుద్యోగ యువత మద్దతు పలకబోతుందనేది వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా.. బర్రెలక్క మాత్రం రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఆమె వైపు చూసే విధంగా చేసింది. బర్రె లక్కను ఆదర్శంగా తీసుకునే యువత రాష్ట్ర రాజకీయాలలో ఓ మలుపు తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ALSO READ : కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాంగ్రెస్..! (ఆడియో)