తల్లిదండ్రులను మించిన దైవం లేదు

ఘనంగా మదర్స్ డే వేడుకలు

తల్లిదండ్రులను మించిన దైవం లేదు

ఘనంగా మదర్స్ డే వేడుకలు

నారాయణపేట, మన సాక్షి:

సృష్టిలో తల్లి దండ్రులను మించిన దైవం లేదని పసితనం నుండే తమపిల్లలకు క్రమశిక్షణ దేశభక్తి సంస్కృతి సాంప్రదాయం తోపాటు ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం నేర్పించి దేశానికి ఉపయోగ పడే ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదే అని ప్రముఖ వైద్యులు గీత విశ్వనాథ్ అన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : బైక్ లో రైతు సొమ్ము దొంగిలించిన వ్యక్తి .. ఫోటో విడుదల చేసిన పోలీసులు.. !

నారాయణపేట గీతా ఆసుపత్రిలో లో ఆదివారం మదర్స్ డే వేడుకల సందర్భంగా బేబీ శ్రీరాఘవి మరియు సిబ్బంది ఆధ్వర్యంలో డాక్టర్ గీత విశ్వనాథ్ దంపతులను పూల మాల శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి, మిఠాయిలను పంపిణి చేశారు ఈ కార్యక్రమంలో గీత హాస్పిటల్ సిబ్బందితోపాటు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.