మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థినిగా పాల్వాయి స్రవంతి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థినిగా పాల్వాయి స్రవంతి
నల్గొండ, సెప్టెంబర్ 09, మనసాక్షి : నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శుక్రవారం ఏఐసీసీ ఖరారు చేసింది. సోనియా గాంధీ సూచన మేరకు పాల్వాయి స్రవంతిని ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా నియమించింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన కృష్ణారెడ్డికి ఆశాభంగం కలిగింది. ఇప్పటికే బిజెపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని ఖరారు చేశారు. కానీ టిఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.