రైతు వ్యతిరేక బిజెపిని తరిమికొట్టాలి – మునుగోడు ప్రజా దీవెన సభలో కెసిఆర్

రైతు వ్యతిరేక బిజెపిని తరిమికొట్టాలి

మునుగోడు ఎన్నిక తెలంగాణ బతుకు తెరువు ఎన్నిక

మునుగోడు ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

మునుగోడు , ఆగస్టు 20, మన సాక్షి: రైతు వ్యతిరేక బిజెపిని తరిమికొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శనివారం నల్గొండ జిల్లా మునుగోడు లో టిఆర్ఎస్ ప్రజా దీవెన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులను కూలీలను చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుకుందన్నారు. ఆసరా పెన్షన్లు కూడా కేంద్రం ఇవ్వోద్దంటుందని, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు బంద్ చేయాలంటున్నారని అన్నారు. రైతుబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని కేసీఆర్ అన్నారు. చచ్చే వరకు మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని రైతు బంధు కూడా చచ్చేవరకు ఆగదని మరోసారి స్పష్టం చేశారు. మునుగోడులో మన బతుకు తెరువు ఎన్నిక జరగనున్నది. ప్రజలే నా బలం ప్రజలే నా ధైర్యం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

సిపిఐ కి ధన్యవాదాలు :

సిపిఐ కూడా టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పల్కిండ్రని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు సిపిఐ కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను రేపు చెప్పాలి

కేంద్ర ప్రభుత్వ విధానాలను రేపు బిజెపి సభలో చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు మునుగోడు గడ్డపై బీజేపీకి ఎప్పుడు డిపాజిట్ రాలేదన్నారు. మూడు మేకలు ఉన్న బిజెపికి ఎందుకు అహంకారమని పేర్కొన్నారు. మునుగోడు లో ఎందుకు ఎన్నికలు వచ్చాయో ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. పొరపాటున బిజెపికి ఓటు వేస్తే మీటర్లు పడ్డట్టేనని అన్నారు. బిజెపి దిమ్మతిరిగేలా దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు :

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో ఎక్కడ లేదని, అది మునిగిపోయే నావ లాంటిదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బహిరంగ సభలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎమ్మెల్సీ , వల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నల్లమోతు భాస్కరరావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి ,నోముల భగత్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ , సిపిఐ నాయకులు పళ్ళ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.