మునుగోడు ఎన్నికల ఆర్వోగా రోహిత్ సింగ్

మునుగోడు ఎన్నికల ఆర్వోగా రోహిత్ సింగ్

జగన్నాథరావును తొలగించిన ఎన్నికల కమిషన్

నల్గొండ , మనసాక్షి : మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ ను ఎన్నికల కమిషన్ నియమించింది. అంతకు ముందు ఆర్ వో పనిచేసిన జగన్నాధ రావును తొలగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు రోలర్ గుర్తును కేటాయించిన అనంతరం తొలగించడంతో రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

దాంతో ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు పరిశీలించి జగన్నాధ రావును ఆర్ వో గా తొలగించారు. ఆయన స్థానంలో రోహిత్ సింగ్ ను నియమించగా గురువారం ఆయన బాధ్యతలు చేపట్టారు.