మునుగోడు తరలి వెళ్లిన మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తలు – latest news

మునుగోడు తరలి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు

మిర్యాలగూడ, మనసాక్షి : నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 100 వాహనాలలో ఎనిమిది వందల మంది చండూరుకు తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) మాట్లాడుతూ పాల్వాయి స్రవంతి గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేసి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేస్తే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మునుగోడు లో వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఓటర్లకు ఆశలు చూపి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారని కానీ మునుగోడు ఓటర్లు చాలా తెలివి కలవారిని నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు తప్పనిసరి అని వారికి తెలుసునని అన్నారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, నాయకులు జలంధర్ రెడ్డి, జానకి రామ్ రెడ్డి, బెజ్జం సాయి, దేశిడి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.