Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : అప్పు ఇచ్చి అడిగినందుకు హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు..!

Nalgonda : అప్పు ఇచ్చి అడిగినందుకు హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు..!

కనగల్, మన సాక్షి:
జంట హత్యల కేసులో ముగ్గురికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా రెండవ అదనపు జడ్జి, మరియు ఎస్సీ ఎస్టీ కోర్టు జిల్లా జడ్జి రోజా రమణి మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు. కనగల్ ఎస్సై విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం….

తీసుకున్న అప్పు డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు 2014 ఆగస్టు 7న కనగల్ మండలం చిన్నమాదారం పరిధి కుమ్మరిగూడెంలో జంట హత్యలు జరిగాయి. నల్లగొండకు చెందిన బొంద రవికుమార్, ఎస్కే గౌస్ ల వద్ద కుమ్మరిగూడెంకు చెందిన మల్లికంటి వెంకటేశ్వర్లు కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు.

అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని నిలదీసి అడగ్గా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడు. ఈ క్రమంలో తీసుకున్న డబ్బులు ఇస్తానని నమ్మబలికి వెంకటేశ్వర్లు అప్పిచ్చిన వ్యక్తులకు ఫోన్ చేసి కుమ్మరిగూడెం పిలిపించాడు.

పథకం ప్రకారం ఎస్కే గౌస్, బొంద రవికుమార్ లను విచక్షణ రహితంగా కత్తులు, గొడ్డళ్లతో వెంకటేశ్వర్లు, భార్య శోభ, తమ్ముడు యాదగిరిలు ముగ్గురు కలిసి నరికి చంపారు. ఈ జంట హత్యల కేసులో నిందితులు మల్లికంటి వెంకటేశ్వర్లు, యాదగిరి, శోభలకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

వెంకటేశ్వర్లు, యాదగిరిలను చర్లపల్లి జైలుకు తరలించగా, శోభను చంచలగూడ జైలుకు రిమాండ్ చేశారు. ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి నిందితులకు శిక్ష పడే విధంగా చేసిన

అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ప్రస్తుత ఏఎస్పి రాములు నాయక్, ప్రస్తుత నల్లగొండ డిఎస్పి శివరామరెడ్డి, అప్పటి డిఎస్పి రామ్మోహన్రావు, సీఐ సుబ్బిరామిరెడ్డి, ఎస్సై పరమేష్, ప్రస్తుత చండూరు సీఐ వెంకటయ్య, కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, ఏపీపీ అఖిల, సి డి వో శేఖర్, నగేష్, సిబ్బంది నరేందర్, మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులను అందజేస్తామన్నట్లు ఎస్సై వివరించారు.

MOST READ : 

WhatsApp : వాట్సప్ సీక్రెట్ చాట్. అదిరిపోయేలా ఈ కొత్త ఫీచర్..!

 

Rythu Bharosa : రైతు భరోసా అప్పుడే.. స్పష్టం చేసిన మంత్రి..!

 

Gold Price : భారీగా రూ.10,900 తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్..!

 

Gold Price : పడిపోయిన పసిడి ధర.. వరుసగా రెండో రోజు భారీగా రూ.13,100 తగ్గింది..!

 

మరిన్ని వార్తలు