Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Nadigudem : తహసిల్దార్ గా మంగ బాధ్యతలు స్వీకరణ..!
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం నూతన తహసిల్దార్ గా లావూరి మంగ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

Nadigudem : తహసిల్దార్ గా మంగ బాధ్యతలు స్వీకరణ..!
నడిగూడెం, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం నూతన తహసిల్దార్ గా లావూరి మంగ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మఠంపల్లి మండలంలో తహసిల్దారుగా పనిచేస్తూ నడిగూడెం మండలానికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నూతన తహసిల్దారు కు రెవెన్యూ సిబ్బంది అభినందనలు తెలిపారు.









