Nalgonda : నల్గొండలో తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో కుళ్ళిన స్థితిలో నాలుగు మృతదేహాలు..!
నల్గొండ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి.

Nalgonda : నల్గొండలో తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో కుళ్ళిన స్థితిలో నాలుగు మృతదేహాలు..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :
నల్గొండ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన తో నల్గొండ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో గత కొన్ని రోజులుగా ఒక ఇంటికి తాళం వేసి ఉంది.
అయితే సోమవారం ఉదయం నుంచి ఆ ఇంటి పరిసరాల్లో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా పోలీసులు ఆ ఇంటికి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళగా హృదయ విదారక దృశ్యం కనిపించింది.
దాంతో పోలీసులతో సహా ఒక్కసారిగా చలించి పోయారు. కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. వారిలో ప్రకాశం బజార్లో బ్యాగుల వ్యాపారం చేస్తున్న మహమ్మద్ సుల్తాన్, అతని భార్య ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సుల్తానా గా గుర్తించారు. వారితో పాటు మరో ఇద్దరి మృతదేహాలు ఉన్నాయి.
కుళ్ళిన స్థితిలో ఉన్న వీరి మృతదేహాలు సుమారు నాలుగు రోజుల క్రితమే వేరు మృతి చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, అదనపు ఎస్పీ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. వీరి మృతి మిస్టరీగా మారింది.










