Nalgonda : ఐఎస్ఐ ఏజెంట్లకు అడ్డాగా నల్గొండ.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన ప్రకటన..!
Nalgonda : ఐఎస్ఐ ఏజెంట్లకు అడ్డాగా నల్గొండ.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన ప్రకటన..!
నల్లగొండ, మనసాక్షి :
తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు, అటల్ బిహారీ వాజ్పాయ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో సీనియర్ బిజెపి నాయకులకు జరిగిన సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ పథకాలు గ్రామ గ్రామాన పాతుకుపోయాయని. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు.
కచ్చితంగా బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు 17 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని తెలిపారు. కార్యకర్తలు పట్టుదలతో కృషి చేస్తే విజయం దానంతట అదే వస్తుంది అన్నారు. నల్లగొండ ఐఎస్ఐ ఏజెంట్లకు, వామపక్ష తీవ్రవాదులకు అడ్డాగా మారిందని, దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగిన దాని మూలాలు నల్లగొండలో కనబడతాయని దీంతో బిజెపి ఎదుగుదలను ఇవి అడ్డుకుంటున్నాయన్నారు.
దక్షిణ తెలంగాణలో బిజెపి పాగా వేస్తుందని తెలిపారు. ఆజాతశత్రువు పరిపాలన ధ్యక్షుడు సహజ కవి అయిన వాజ్ పేయి పరిపాలన స్వర్ణ యుగామని ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు .రెండు సీట్లున్న బిజెపిని వాజ్పేయి అద్వానీ బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీని అభివృద్ధి చేశారన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారి కూడా ఐకెపి సెంటర్లను సందర్శించలేదని అన్నారు. రైతులకు మద్దతు ధర కూడా అందడం లేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరణి కూడా దండుకుంటున్నారన్నారు.
సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు చింతా సాంబ మూర్తి, బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి. గోలి మధుసూదన్ రెడ్డి వీరేల్లి చంద్రశేఖర్ డోనూరు వీరారెడ్డి బెజవాడ శేఖర్ శ్యాంసుందర్ జగ్జీవన్. కూతురు సత్యవతి పిల్లి రామారావు యాదవ్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
MOST READ NEWS :
(ఎక్కువ మంది చదివినవి)
—————————— ————————-
-
NEET : నీట్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNS అమలు.. జిల్లా ఎస్పీ..!
-
Miryalaguda : కళాభారతికి కేసిఆర్ పేరు తొలగించడంపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు..!
-
Bank Holidays : మే నెలలో బ్యాంకులకు సెలవులే.. సెలవులు.. ఎన్ని రోజులంటే..!
-
Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల్లో కీలక మార్పులు..!
-
Gold Price : నిలకడగా బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!









