Nalgonda : ఎరుపెక్కిన నల్లగొండ ఖిల్లా..!
Nalgonda : ఎరుపెక్కిన నల్లగొండ ఖిల్లా..!
నల్లగొండ, మన సాక్షి.
సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నల్లగొండ పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది పట్టణమంతా ఎర్రజెండాలతో కిక్కిరిసిపోయింది సిపిఐ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోరాటల ఖిల్లా నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగసభను నిర్వహించారు.
సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు ముఖ్యఅతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా , మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు హజరయ్యారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, జాతీయ సమితి సభ్యులు, కె.శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస రావు, కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్, ఎం.బాలనరసింహా, ఇ.టి.నరసింహా, వి.ఎస్.బోస్ వేదికపై ఆసీనులయ్యారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా స్వాగతం ఉపన్యాసం ఇస్తూ వందేళ్ళ కొంద స్థాపించబడిన భారత కమ్యూనిస్టు పార్టీ భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని నినదించిన మొట్టమొదటి పార్టీ అని, వలసవాదులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిందని తెలిపారు.
సభకు సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం స్వాగతం పలకగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, పల్లా నరసింహారెడ్డి,సీనియర్ నాయకులు ఉజ్జని రత్నాకర్ మల్లేపల్లి ఆదిరెడ్డి , రావు, సిపిఐ యాద్రాది భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, హైదరాబాద్ జిల్లా ఎస్.ఛాయాదేవితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కార్యదర్శులు, ప్రజా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు వేదికపై ఆశీనులైయ్యారు.
MOST READ :










