నల్గొండ : రేపు ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. మెగా జాబ్ మేళా..!

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం ఉదయం 9 గంటలకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నల్గొండ : రేపు ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. మెగా జాబ్ మేళా..!

ఎంజి యూనివర్సిటీలో ఏర్పాట్లు చేసిన అధికారులు

జాబ్ మేళాను ప్రారంభించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ .మన సాక్షి.

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం ఉదయం 9 గంటలకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టాస్క్ మరియు తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కౌన్సిల్ సహకారంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రారంభించనున్నారు.

జాబ్ మేళాకు వేలాదిమంది యువతి, యువకులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

జాబ్ మేళాను ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ : 

మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ఆదివారం నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎంజి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గోపాల్ రెడ్డి, ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డితో కలిసి ఎంజి యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ,యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వర్ రావు, జెడ్పి డిప్యూటీ సీఈవో శ్రీనివాస్ రావు, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, ఎంజియూ రిజిస్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ వై. ప్రశాంతి, టాస్క్ మేనేజర్ ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.