నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ టికెట్ రఘువీర్ రెడ్డికే..?

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వివిధ రాజకీయ పార్టీల నేతలు అంచనాలు వేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ బలం మరింతగా పెరిగింది.

నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ టికెట్ రఘువీర్ రెడ్డికే..?

మనసాక్షి , నల్గొండ :

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వివిధ రాజకీయ పార్టీల నేతలు అంచనాలు వేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ బలం మరింతగా పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుకు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చర్యలు చేపట్టారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై పూర్తి నమ్మకం ఏర్పడిందని చెప్పవచ్చును.

నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో సూర్యాపేట మినహా మొత్తం సీట్లను కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. నల్లగొండ పార్లమెంటు పరిధిలో నల్లగొండ , దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక సూర్యపేట మినహా మిగతా అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.

ఈ తరుణంలో నలగొండ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం సులభమే. కాగా నలగొండ పార్లమెంటు బరిలో ఇప్పటివరకు మాజీ మంత్రి , సీఎల్పీ మాజీ లీడర్ కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి పేరు వినిపిస్తుంది.

ALSO READ : హైదరాబాద్ : 13 దేశాల ప్రతినిధులకు రేవంత్ రెడ్డి ఆతిథ్యం..!

కుందూరు రఘువీర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిర్యాలగూడ టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పాలసీలో భాగంగా వారి కుటుంబంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రఘువీర్ రెడ్డి సోదరుడు జై వీర్ రెడ్డి కి టికెట్ కేటాయించారు. దాంతో రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కేటాయించలేదు.

అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రఘువీర్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం.

ALSO READ : Runa mafi : రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్..!

కాగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రఘువీర్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు . దాంతో ఆయన ఆశించే పార్లమెంటు టికెట్ నూటికి నూరు శాతం వస్తుందని రఘువీర్ రెడ్డి అనుచరులు పేర్కొంటున్నారు.