Nara Lokesh : నారా లోకేష్ కు ఊరట.. అప్పటివరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు..!
Nara Lokesh : నారా లోకేష్ కు ఊరట.. అప్పటివరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు..!
అమరావతి, మన సాక్షి :
నారా లోకేష్ కు స్వల్ప ఊరట లభించింది. అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్కిల్, సైబర్ నెట్ కేసులో లోకేష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్ పై అత్యవసరంగా విచారించాలని హైకోర్టును ఆశ్రయించారు.
స్కిల్ డెవలప్మెంట్ తో పాటు సైబర్ నెట్ కేసులకు ముందస్తు బెయిలు పిటిషన్ ను లోకేష్ తరపున న్యాయవాదులు దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ తోసి పుచ్చిన ఏపీ హైకోర్టు. విచారణకు సహకరించాలని లోకేష్ కు కోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ కు 41A నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు ఇచ్చేందుకు ఏపీ సి ఐ డి ఢిల్లీకి వెళ్ళింది. లొకేష ను విచారించినందుకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
ALSO READ : NBR FOUNDATION GOOD NEWS : నిరుద్యోగులకు ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ గుడ్ న్యూస్.. అక్టోబర్ 4న మెగా జాబ్ మేళా..!









