Narayanpet : జిల్లా ఎస్పీ హెచ్చరిక.. సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు..!
నారాయణపేట జిల్లా పరిధి లో సామాజిక మాధ్య మాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Narayanpet : జిల్లా ఎస్పీ హెచ్చరిక.. సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
నారాయణపేట జిల్లా పరిధి లో సామాజిక మాధ్య మాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
బక్రీద్ పండుగ సందర్భంగా కుల, మత, ప్రాంతీయం గాను ప్రజల భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్న వాటిని సామాజిక మాద్యమాలలో షేర్ చేసిన చట్టప్రకారం తీవ్ర మైన చర్యలు ఉంటాయని తెలిపారు.
సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్ బుక్ ,ట్విట్టర్,ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూపులలో ఇతరు లకు ఇబ్బంది కలిగే విధంగా, ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్న, తమకు తెలియని వీడియోలు, ఫోటోలు పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన ఆ గ్రూపు అడ్మిన్ నీ బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడుతాయి అని తెలిపారు.
సామాజిక మధ్యమాలను మంచి పనులకు తప్ప వేరే రకంగా వినియోగించే వాళ్లపైన ప్రత్యేకంగ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.జిల్లాలో ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడే వారిని అనుక్షణం పోలీసులు గమనిస్తూ ఉండా లని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తరహా నేరలకు పాల్పడే వారిని వెంటనే పట్టుకొని అట్టి వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.
పోలీసులు నిరంతరం 24/7 పరిశీలిస్తుంటారని తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేసిన, ఫార్వర్డ్ చేసిన జాగ్రత్తగా గమనించి చేయాలని ఎస్పీ సూచించారు.