Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

NARAYANPET : కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉంటే.. MV act ప్రకారం చర్యలు..!

NARAYANPET : కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉంటే.. MV act ప్రకారం చర్యలు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

జిల్లా కేంద్రంలో శుక్రవారంసీఐ శివశంకర్ ఆధ్వర్యంలో నారాయణపేట పోలీసులు ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఒకవేళ అలాంటివి ఉపయోగిస్తే ఎంవీ ఆక్ట్ సెక్షన్ 77 ప్రకారం 735/- రూ. జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.

వాహనదారులు తప్పకుండా వాహనాలకు సంబంధించిన ఆర్సి, లైసెన్స్ పత్రాలను మరియు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు నెంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని తెలిపారు. తల్లి తండ్రులు మైనర్ లకు వాహనాలు ఇవ్వరాదని మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సీఐ కోరారు.

ALSO READ : 

Banana : అరటిపండు తినడం వల్ల ఆ.. ప్రయోజనాలు కూడా ఉంటాయి.. అవేంటో తెలుసుకుందాం..!

Milk packets : మీరు ప్యాకెట్ పాలు తాగుతున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

Srisailam : శ్రీశైలం అవుట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులు.. వేగంగా పెరుగుతున్న సాగర్ నీటిమట్టం.. Latest Update

మరిన్ని వార్తలు