సత్తుపల్లి : వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి

సత్తుపల్లి, మనసాక్షి:

సత్తుపల్లి ప్రభుత్వా ఏరియా ఆసుపత్రి మాత శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల నవజాత శిశువు మృతి చెందిన సంఘటన  చోటుచేసుకుంది.

 

సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన భారతి అనే గర్భిణి నిన్న 9వ తారీకు ఉదయం నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి రాగా వైద్యులు సాధారణ కాన్పు చేస్తామని చెప్పడంతో ఆసుపత్రిలో చేరారు. నేటి ఉదయం వరకు అంతా బాగానే ఉందని తెలిపిన నర్సులు తీరా కాన్పు అయ్యాక శిశువు పెరగకపోవడం వలన చనిపోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి
గురయ్యారు.

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!

 

మరణించిన శిశువు తండ్రి నాగేంద్ర మాట్లాడుతూ నిన్న ఉదయం ఆసుపత్రికి తీసుకువచ్చిన తర్వాత కాన్పు చేస్తామని చేర్చుకొని అవసరమైన మందులు రాశారని ఆ మందులు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో లేవని ప్రైవేట్ మందులు షాపుల నుండి తెచ్చామని ఆవేదనకు లోనయ్యాడు.

 

నొప్పులు విపరీతంగా రావడంతో శస్త్రచికిత్స చేసి డెలివరీ చేయమని బ్రతిమలాడమని అయినా వినకుండా నిర్లక్ష్యం చేయడంతో శిశువు మరణించిందని కన్నీటి పర్యంతమయ్యాడు.

 

ALSO READ : RBI : రూ. 500 నోట్లపై ఆర్ బీ ఐ కీలక ప్రకటన..!

 

డాక్టర్స్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే నవజాత శిశువు మరణించిందని ప్రతిరోజూ ఉదయం 10 నుండి 1 వరకు ఆసుపత్రిలో ఉండాల్సిన వైద్యులు 11 గం లకు వచ్చి ఒక గంట మాత్రమే ఉంటున్నారని మొత్తం నర్సుల పర్యవేక్షణలోనే వైద్యం జరుగుతుందని ఎదైనా అత్యవసరం అయితే తప్ప డాక్టర్ రావడం లేదని ప్రజలు వాపోతున్నారు.