NBR FOUNDATION GOOD NEWS : నిరుద్యోగులకు ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ గుడ్ న్యూస్.. అక్టోబర్ 4న మెగా జాబ్ మేళా..!
NBR FOUNDATION GOOD NEWS : నిరుద్యోగులకు ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ గుడ్ న్యూస్.. అక్టోబర్ 4న మెగా జాబ్ మేళా..!
మిర్యాలగూడ , సెప్టెంబర్ 28, మన సాక్షి :
నిరుద్యోగులకు ఎన్.బీ.ఆర్ ఫౌండేషన్ గుడ్ న్యూస్ తెలియజేసింది. అక్టోబర్ 4వ తేదీన మిర్యాలగూడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ తెలిపారు.
అక్టోబర్ 4న మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్‌లోని టీ.ఎన్.ఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఎన్.బీ.ఆర్ ఫౌండేషన్ ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, జాబ్ మేళాలో మొత్తం 21 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారని ఎన్.బీ.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ తెలిపారు.
ALSO READ : Train Derails Video : ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన రైలు.. ఇంజన్ క్యాబిన్ లో సీసీ కెమెరా దృశ్యాలు..!
జాబ్ మేళా పోస్టర్‌ను గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు ఇట్టి సదావకాశాన్ని వినియోగించి స్థిరమైన ఉద్యోగం పొందాలని ఆకాంక్షించారు.
స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారీ, ఖాజా మొహినుద్దీన్, జక్కా నాగేశ్వర్ రావు, సుద్దుల సైదులు, ఎం.డి షోయబ్, శిరసనగండ్ల శ్రీకాంత్ చారీ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
- Khairathabad Crocodile : ఖైరతాబాద్ నాలాలో మొసలి ప్రత్యక్షం.. భయాందోళనలో ప్రజలు..!
- Balapur Ganesh Laddu : రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు.. వేలంపాటలో దక్కించుకున్న రియాల్టర్..!
- హైదరాబాద్ : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు వేలంపాట.. రూ.1.26 కోట్లు, అది ఎక్కడంటే..!
- Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!










