Angel One: ఏంజెల్ వన్ ఏఎంసీ నుంచి కొత్త నిఫ్టీ 50 ఫండ్ల ప్రకటన..!
Angel One: ఏంజెల్ వన్ ఏఎంసీ నుంచి కొత్త నిఫ్టీ 50 ఫండ్ల ప్రకటన..!
ముంబై, మన సాక్షి :
ఏంజెల్ వన్ లిమిటెడ్ సబ్సిడియరీ ఏంజెల్ వన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రెండు కొత్త ప్యాసివ్ ఫండ్లను ప్రవేశపెట్టింది. అవి ఏంజెల్ వన్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఏంజెల్ వన్ నిఫ్టీ 50 ఈటీఎఫ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్ఎఫ్ఓ) మే 5, 2025 నుంచి మే 16, 2025 వరకు సబ్స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటాయి.
ఈ ఫండ్లు నిఫ్టీ 50 ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తాయి. భారతదేశంలోని టాప్ 50 లార్జ్-క్యాప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని ఇన్వెస్టర్లకు అందిస్తాయి. ఈ కంపెనీలు టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఆటోమొబైల్ వంటి 15 కీలక రంగాల్లో ఉన్నాయి. సరళత, స్థిరత, తక్కువ ఖర్చుతో భారత ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు. ఈ ఫండ్లను ఖర్చుల ముందు ఇండెక్స్ రిటర్న్‌లను సమీపంగా అందించేలా రూపొందించారు.
ఏంజెల్ వన్ ఏఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ హేమెన్ భాటియా మాట్లాడుతూ… “లార్జ్-క్యాప్ ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి నేరుగా స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ల ద్వారా అనేక మార్గాలున్నాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం స్టాక్ ఎంపిక, మానవ విచక్షణ వంటి రిస్క్‌లను తొలగిస్తుంది” అన్నారు.
ఇవి కూడా చదవండి:
-
SBI: ఫ్లెక్సీ హోమ్ ఇన్సూరెన్స్‌ను ప్రారంభించిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్..!
-
Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. సబ్ కలెక్టర్ ఆదేశం..!
-
Paddy : కర్ణాటక నుంచి అక్రమంగా ధాన్యం రవాణా.. చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు..!
-
Muthoot: అత్యుత్తమ ఈఎస్జీ స్కోరును సాధించిన ముథూట్ మైక్రోఫిన్..!
-
Sleep : నిద్ర పట్టట్లేదా.. ఈ చిట్కాలు పాటించండి..!









