Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ: నిత్యం నిఘా.. తనిఖీలు నిర్వహించాలి 

మిర్యాలగూడ: నిత్యం నిఘా.. తనిఖీలు నిర్వహించాలి 

నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని హాలియ, నిడ్మనూర్ పోలీస్ స్టేషన్ లను జిల్లా ఎస్పీ అపూర్వరావు సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు గురించి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని అన్నారు.

 

పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేటును మరింత తగ్గించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కేసులను త్వరిత గతిన పూర్తిచేసి భాదితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని అన్నారు. ఎండ కాలంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దొంగతనాలు జరగకుండా పగలు,రాత్రి గట్టి పెట్రొలింగ్ నిర్వహించాలన్నారు.

 

సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి గ్రామాలలో ప్రధాన కూడలిలలో,కాలనీలలో సి.సి కెమెరాల ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపార సముదాయాల నిర్వహులకు అవగాహన కల్పించాలని కోరారు.

 

అన్ లైన్ సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణ కొరకు ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల ఓవర్ స్పీడ్, పరిమితికి మించి ప్రయాణించే వాహనాల పైన స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ప్రమాదాల నివారణ కొరకు రోడ్డు భద్రతా,ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించాలని అన్నారు.

 

అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అక్రమ గంజాయి, పీడీఎస్ రైస్,జూదం లాంటి కార్యకలాపాల పైన అను నిత్యం నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. పగలు రాత్రి గట్టి పెట్రొలింగ్ మరియు బీట్లు నిర్వహించాలని బ్లూకోర్ట్స్, పెట్రో మొబైల్ పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలని అన్నారు.

 

పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిoచి బాధితులకు తగు న్యాయం జరిగేలా సిబ్బంది పనిచేయాలని, సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం, బరోసా కల్పించాలని అన్నారు,

 

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డి.యస్.పి వెంకటగిరి, హాలియ సిఐ గాంధీ నాయక్, హలియా యస్.ఐ క్రాంతి కుమార్, నిడ్మనూర్ యస్.ఐ శోభన్ బాబు, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు