Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

నిరుద్యోగ జంగ్ సైరన్ ను విజయవంతం చేయాలి 

నిరుద్యోగ జంగ్ సైరన్ ను విజయవంతం చేయాలి 

సూర్యాపేట , మనసాక్షి

పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి వ సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు సరూర్ నగర్ తరలిరావాలని పిసిసి ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి అన్నారు.

 

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ సమీక్ష సమావేశము సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.

 

ముఖ్యఅతిథిగా పిసిసి ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి పాలుగోని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై, పేపర్ లీక్ లకు నిరసనగా నిరుద్యోగ జంగ్ సైరన్ సభ, సరూర్ నగర్ గ్రౌండ్ లో మే 8 నాడు నిర్వహించనున్న సందర్బంగా ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ వస్తున్న తరుణంలో సూర్యాపేట నియోజకవర్గంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి సూర్యాపేట నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణం చేసి, ప్రతి మండలంలో మండల అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి భారీ జనసమీకారనతో సభను విజయవంతం చేయాలని కోరారు.

 

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించలేని ఈ విధానం తెలంగాణా మోడలా, ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులకు భృతి ఇస్తా మంటూ 2018 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చారని.. వారు చెప్పిన ప్రకారం ఈ 51 నెలలకుగాను ఒక్కో నిరుద్యోగికి రూ.1.60 లక్షల నిరుద్యోగభృతి ఈ ప్రభుత్వం బాకీ ఉందని. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు.

 

తొమ్మిదేళ్ల పాలనలో ఉద్యోగాలెందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. అందుకే ఈ నెల 8 న జరిగే నిరుద్యోగ జంగ్ సైరన్ సభకు వేలాది మంది తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలి,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు శైలేందేర్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి,తూముల సురేష్ రావు,ధారవత్ వీరన్న నాయక్,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొలాగాని బాలు గౌడ్,జిల్లా కార్యదర్శి నాగుల వాసు,చెరుకు రాము,

 

సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి,ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షుడు వల్దాసు శ్రీను,జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యలగందుల సాయినేత,జవహర్ బాలమంచ్ చీఫ్ శివ నాయక్,రెడ్ హౌస్ ఇంచార్జి నరేందర్ నాయుడు, జిల్లా నాయకులు ధారవత్ నాగు నాయక్, జమండ్ల సత్యనారాయణ,కోడి శివ, అబ్బాస్,పసుల అశోక్ యాదవ్, వట్టిఖమ్మంపాడ్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు