Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Nizamabad : ఆర్మూర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. రూ.40 వేల భారీ జరిమానా..!

ఆర్మూర్ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఆర్మూర్ పట్టణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఎస్.హెచ్.ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు.

Nizamabad : ఆర్మూర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. రూ.40 వేల భారీ జరిమానా..!

ఆర్మూర్, మన సాక్షి

ఆర్మూర్ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఆర్మూర్ పట్టణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఎస్.హెచ్.ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన నిందితులను సోమవారం జె.ఎఫ్.సి.ఎం కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ సరళ రాణి కేసును విచారించి సంచలన తీర్పునిచ్చారు. నిందితులు నలుగురికి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున, మొత్తం రూ. 40,000 భారీ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.ఇలాంటి చర్యలు కేవలం వాహనదారులకే కాకుండా, తోటి ప్రయాణికులకు మరియు పాదచారుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు. నూతన మోటార్ వాహన చట్టం ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా కఠినతరం చేశామని, కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు