బేతుపల్లి చెరువు ప్రత్యామ్నాయ కాలువకు ఎన్టీఆర్ కాలువగా నామకరణం

బేతుపల్లి చెరువు ప్రత్యామ్నాయ కాలువకు ఎన్టీఆర్ కాలువగా నామకరణం

సత్తుపల్లి, మనసాక్షి:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య,రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డితో కలిసి సత్తుపల్లి పట్టణ శివారు చెరువులో కట్టా మైసమ్మ,గంగమ్మ తల్లుల పూజ నిర్వహించారు.

ALSO READ : App : మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.. లేదంటే మీ డేటా చోరీ అవుద్ది..!

 

బేతుపల్లి చెరువు ప్రత్యామ్నాయ కాలువకు ఎన్టీఆర్ కాలువగా నామకరణం చేస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఇటీవల బెస్ట్ ఇంజనీర్ గా ఎంపికైన శ్రీనివాస్ రెడ్డీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ALSO READ : Virupaksha Memes : విరూపాక్ష మీమ్స్… నాన్ స్టాప్ కామెడీ.. నెట్టింట్లో వైరల్ (వీడియోస్)

 

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కూసంపూడి రామారావు,సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కూసంపూడి మహేష్,కమిషనర్ సుజాత,ఖమ్మం జిల్లా గ్రంధాలయాల చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, మున్సిపాలిటీ కౌన్సిలర్ చాంద్ పాషా, మట్టా ప్రసాద్,నడ్డి ఆనందరావు,అంకమ్మరాజు, పెద్దిరాజు,  పార్టీ కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.