Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?

NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?

హైదరాబాద్ , మనసాక్షి :

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (100వ) శతజయంతి వేడుకలకు వంద రూపాయల నాణాన్ని ఆయన గౌరవార్థం ప్రభుత్వం విడుదల చేయనున్నది.

 

ఆయన శతజయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణాన్ని సోమవారం (28వ తేదీన) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ , బిజెపి ఏపీ అధ్యక్షరాలు పురంధరేశ్వరి హాజరుకానున్నారు.

 

నూరు శాతం లోహాలతో తయారు :

శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న 100 రూపాయల నాణెంలో నూరు శాతం లోహాలతో తయారు చేయడం విశేషం. 44 మిల్లీమీటర్ల ఈ నాణెంలో 50% సిల్వర్ (వెండి ) 40 శాతం కాపర్ (రాగి) మిగతా 5% నిఖిల్ , 5 % జింక్ లోహాలతో ఉంటుంది.

 

ఈ నాణెం విషయంలో ఓవైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం . దాని కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. 1923 – 2023 అని ముద్రితమై ఉంటుంది.

 

MOST READ : 

1. Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

2. Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !

3. Ponguleti : పొంగులేటి మూడు చోట్ల నుంచి దరఖాస్తులు.. ఎందుకో తెలుసా..!

4. How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!

5. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!

 

హైదరాబాదులో :

హైదరాబాదులోని మెంట్ కాంపౌండ్ లోనే ముద్రించారు. 100 రూపాయల నాణం మీద ముద్రించిన ఎన్టీఆర్ బొమ్మలను ఆయన కుటుంబ సభ్యులే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. వంద రూపాయల నాణెంపై ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా నందమూరి తారక రామారావు నాణెం ముద్రించడం.. విడుదల చేయడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన నాణెంతో ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్లలో అభిమానులు ఆనందంతో పోస్టులు షేర్ చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు