ఆయిల్ ఫామ్ లో అంతర్ పంటల సాగు తో అధిక లాభం..!

ఆయిల్ ఫామ్ లో అంతర్ పంటల సాగుతో అధిక లాభం పొందుతున్నారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లాలోని మోతే మండలం నామారం గ్రామం,చివ్వెంల మండలం, గుంపుల తిరుమలగిరి గ్రామంలో ఆయిల్ తోటలను కలెక్టర్ పరిశీలించారు.

ఆయిల్ ఫామ్ లో అంతర్ పంటల సాగు తో అధిక లాభం..!

జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

సూర్యాపేట, మనసాక్షి

ఆయిల్ ఫామ్ లో అంతర్ పంటల సాగుతో అధిక లాభం పొందుతున్నారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లాలోని మోతే మండలం నామారం గ్రామం,చివ్వెంల మండలం, గుంపుల తిరుమలగిరి గ్రామంలో ఆయిల్ తోటలను కలెక్టర్ పరిశీలించారు.

ఆయిల్ ఫామ్ పంటలలో అంతర పంటలుగా మిర్చి వేసిన రైతు ఎన్ రాఘవరెడ్డి తన 5 ఎకరాలలో పామాయిల్ తో పాటుగా అంతర్ పంటగా వేసిన మిర్చి పంటను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆరున్నర ఎకరాలలో ఆల్ఫామ్ మొక్కలను వేసిన దుబ్బాక ప్రభాకర్ రెడ్డి పొలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయిల్ ఫామ్ తో పాటుగా అంతర్పంటగా కంది పంట వేసిన ప్రభాకర్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు.

పంట భూములలో వారు వాడుతున్న బిందు సేద్యం పరికరాలను పరిశీలించారు. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందుతున్న పామాయిల్ తోటల సబ్సిడీ వివరాలను రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రభాకర్ రెడ్డి, రాఘవరెడ్డి వేసిన ఆయిల్ ఫామ్ తోట ఎదుగుదల బాగుందని కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. పామాయిల్ తోటలను సాగు చేస్తున్నందుకు కలెక్టర్ రైతులను అభినందించారు.

ALSO READ : సూర్యాపేట : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం..!
పామాయిల్ సాగుతో పాటుగా అంతర్ పంటల ద్వారా మంచి ఆదాయం లభిస్తుందని కలెక్టర్ తెలియజేశారు. పామాయిల్ తోటలో అన్ని రకాల పంటలు అంతర పంటలుగా సాగు చేయవచ్చు అన్నారు. పామాయిల్ పంట నాలుగో సంవత్సరంలో పంట దిగుబడి వస్తుందని, ఇలాగే 30 సంవత్సరాల పాటు ఆయిల్ ఫామ్ తోటల వలన ప్రతినెల స్థిరమైన ఆదాయం వస్తుందని కలెక్టర్ తెలియజేశారు.

సూర్యాపేట జిల్లాలో పతాంజలి కంపెనీ ద్వారా పామాయిల్ మొక్కల పంపిణీ జరుగుతుందని తెలిపారు. పామాయిల్ తోటలో మొదటి నాలుగు సంవత్సరాలు అంతర్ పంటలుగా మిర్చి, కూరగాయలు, వేరుశనగ, కంది ,అరటి, బొప్పాయి వంటి పంటల సాగు ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు అన్నారు.

ALSO READ : IMP NEWS : పేపర్,  పాలు డెలివరీ చేసే వాళ్ళని ఇంటికి రావద్దని చెప్పాలి..!

ఆయిల్ ఫామ్ తోటలలో అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, కోళ్లు పెంపకం, గొర్రెల పెంపకం కూడా చేపట్టవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల అధికారి బి శ్రీధర్ గౌడ్ , పతాంజలి పామాయిల్ కంపెనీ డీజీఎం బి యాదగిరి, సూర్యాపేట ఉద్యాన ధికారి కన్నా జగన్, పతాంజలి ఏరియా మేనేజర్ జే హరీష్ ఫీల్డ్ ఆఫీసర్ డి సుధాకర్, రైతులు ఎన్ రాఘవరెడ్డి ,దుబ్బాక ప్రభాకర్ రెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.