లక్షెట్టిపేట : వ్యక్తి ఆత్మహత్య

లక్షెట్టిపేట : వ్యక్తి ఆత్మహత్య

లక్షేట్టిపేట్, (మన సాక్షి);

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన మాదాసు రమేష్ (46)సంవత్సరాల వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాలలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందతూ మృతి చెందాడు.

 

మృతుడి భార్య చెప్పిన వివరాలకు ప్రకారం మృతుడు వ్యవసాయం చేస్తు తనకున్న ఆటో ట్రాలీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోశించుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనస్థాపం చెందిన తను మే 24వ బుధవారం రోజు సాయంత్రం తన ఇంటి ముందు కూర్చుని ఆలోచిస్తు పురుగుల మందు త్రాగాడు.

 

గమనించిన కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ తరలించారు. అక్కడ కూడా రమేష్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీనించిందని చెప్పడంతో మంచిర్యాల ఆసుపత్రికి తీసుకువచ్చి చేర్పించగా చికిత్స పొందుతూ మే 26 శుక్రవారం రోజున రోజున రాత్రి అందాల తొమ్మిదిన్నర సమయంలో చనిపోయాడు.

 

మృతునికి భార్య ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము అని లక్షెట్టిపేట ఎస్సై ఎస్ లక్ష్మణ్ తెలిపారు.