ఓపెన్ ఇంటర్, పదవ తరగతి అడ్మిషన్లకు అవకాశం

ఓపెన్ ఇంటర్, పదవ తరగతి అడ్మిషన్లకు అవకాశం

వేములపల్లి,  మనసాక్షి:

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఒకే ఏడాదిలో నేరుగా టెన్త్ పూర్తి చేసుకునే అవకాశంతో బాటు,పదో తరగతి పాసైన వారు ఈ ఏడాదిలోనే ఇంటర్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తోందని ఓపెన్ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రావుల పెంట కో-ఆర్డినేటర్, ప్రధానోధ్యాయులు లక్ష్మణ్ నాయక్ తెలిపారు.

అడ్మిషన్ల గడువు గతంలోనే పూర్తయినప్పటికీ ప్రస్తుత సంవత్సరం 2023-24 లో అడ్మిషన్ పొందేందుకు మరో అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆసక్తి కలవారు పదో తరగతి అడ్మిషన్ కోసం రికార్డ్ సీటు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు ఫోటో తో సంప్రదించాలని,ఇంటర్ అడ్మిషన్ల కోసం టెన్త్ మేమో, టిసి, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో సంప్రదించాలని కోరారు.

అడ్మిషన్ తీసుకునేందుకు ఈనెల 30వ తేదీ వరకు ఉన్నది అని తెలిపారు. వివరాల కొరకు 9951190467 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు :