రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది – ఎమ్మెల్యే గాదరి కిషోర్

రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

అర్వపల్లి, నవంబర్ 4, మన సాక్షి ; వర్షాకాలం సీజన్లో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
శుక్రవారం మండల కేంద్రంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర వస్తుందని అన్నారు.
మధ్య దళారుల మాటలతో రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని అన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తాలు మట్టి పిల్లలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అదేవిధంగా రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తో సహా జిరాక్స్ కాపీలు తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి కిరణ్ కుమార్ జెసి మోహన్రావు తాసిల్దార్ యాదగిరి రెడ్డి ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీ నరసయ్య యాదవ్ జడ్పిటిసి దావుల వీరప్రసాద్ యాదవ్ ఏవో ఎం పి ఓ ఏపీఎం సర్పంచ్ బైరబోయిన సునీత రామలింగయ్య ఎంపీటీసీ కనుకు పద్మ శ్రీనివాస్ పి ఎస్ సి ఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి దేవస్థాన చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్ మారిపద్దే శ్రీనివాస్ సోమేశ్ గౌడ్ మహిళా సంఘం నిర్వాహకులు పాల్గొన్నారు