No Entry : తెలంగాణలోకి ధాన్యం ఎంట్రీ
No Entry : తెలంగాణలోకి ధాన్యం ఎంట్రీ
సూర్యాపేట, మనసాక్షి
ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా కు ధాన్యం రాకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు. మంగళవారం కోదాడ మండలం లోని రామాపురం బోర్డర్ చెక్ పోస్ట్ ను జిల్లా యస్.పి రాజేంద్రప్రసాద్ తో కలసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల నుండి జిల్లా లోపలికి ధాన్యం రాకుండా పటిష్ట నిఘా పెంచామని తెలిపారు.
పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ మార్కెట్, అలాగే వ్యవసాయ శాఖ సిబ్బంది తో 24 గంటలు నిఘా ఉంచామని అన్నారు. అన్ని చెక్ పోస్ట్ లలో ఇతర రాష్ట్ర వాహనాల వే బిల్స్, వాహనాల పేపర్స్ తనిఖీలు చేసి ధాన్యం లోడ్ తో ఉన్న వాహనాలు తిరిగి పంపించాలని సిబ్బందిని ఆదేశించారు. చెక్ పోస్ట్ రిజిస్టర్ను కలెక్టర్ పరిశీలించారు .
ధాన్యం పండించిన రైతులు ఎక్కడ కూడా అధైర్య పడొద్దని ప్రతి గింజంను కొనుగోలు చేస్తామని తెలుపుతూ ఇప్పటికే అన్ని కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా మిల్లులలో దిగుమతి చేయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ తో పాటుగా ఆర్.డి.ఓ కిషోర్ కుమార్, డి.ఎస్.పి జి. వెంకటేశ్వర రెడ్డి ,తహసీల్దార్ శర్మ, ఇతర శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.









