Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవ్యవసాయంసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం

ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం

సూర్యాపేట, మనసాక్షి

రైతులు పండించిన ధాన్యం ను సకాలంలో కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.మంగళవారం చివ్వేంల మండల కేంద్రం లోని ఐ కె పి సెంటరులో వడ్ల కొనుగోలు కేంద్రంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..

 

రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లకుండా ఆర్భాటాల కోసం మాత్రమే ఐ కె పి కేంద్రాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలను బస్తాలు సరఫరా చేయడంలో ఆలస్యం కావడంతో కొనుగోళ్లు ప్రారంభం కాలేదని దీనితో కేంద్రంలో పోసిన ధాన్యం అకాల వర్షాల కు తడిసి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.

 

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వడ్ల కొనుగోలు ,లోడింగ్ ను వేగవంతం చేయాలని కోరారు. తడిసిన దాన్యంనకు కూడా మద్దతు ఇచ్చి రైతులు నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు