Penpahad : పెన్ పహాడ్ లో 1.7 కీలోల గంజాయి పట్టివేత..!
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు గంజాయిని గురువారం పట్టుకున్నారు. పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, పెన్ పహాడ్ యస్ ఐ కస్తాల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.

Penpahad : పెన్ పహాడ్ లో 1.7 కీలోల గంజాయి పట్టివేత..!
పెన్ పహాడ్, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు గంజాయిని గురువారం పట్టుకున్నారు. పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, పెన్ పహాడ్ యస్ ఐ కస్తాల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.
మండలంలోని అనంతారం క్రాస్ రోడ్డు వద్ద ఎస్ ఐ గోపికృష్ణ తన పోలీసు సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి ఒక ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు పరారవుతుండగా పట్టుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి1 కేజీ 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామానికి చెందిన బొమ్మ కంటి గోపి, పెన్ పహాడ్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన చింతల వెంకటేష్ కొన్ని రోజుల క్రితం ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లి రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేసి. దీనిలో 300 గ్రాములు వినియోగించారు.
మిగిలిన1.7 కిలోల గంజాయిని సూర్యాపేటలో విక్రయించడానికి, అమ్మటానికి, పెన్ పహాడ్ నుంచి సూర్యాపేటకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అనంతారం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులకుచిక్కినారు. నిందితుల నుంచి ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో జోసెఫ్, మధుకర్, లింగరాజు, ప్రవీణ్ పాల్గొన్నారు.