దేవరకొండ : పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ప్రజా స్పందన

దేవరకొండ : పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ప్రజాస్పందన

చింతపల్లి. మన సాక్షి :

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బొంద పెట్టే రోజులు ఆసన్నమయ్యాయని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం దేవరకొండ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న బట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఎంతో ప్రజాస్పందన సంతలించుకుంది.

 

ఉదయం చందంపేట మండలం నుండి ప్రారంభమైన రోడ్ షో పాదయాత్ర కు దేవరకొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నేనావత్ బాలు నాయక్, నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ బిలియా నాయక్, జగన్ లాల్ నాయక్, పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొని పెద్ద ఎత్తున వారికి సంఘీభావం వ్యక్తం చేశారు.

 

Also Read : RBI : రూ. 500 నోట్లపై ఆర్ బీ ఐ కీలక ప్రకటన..!

 

ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందే అని వారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షుణంగా పరిశీలిస్తున్నారన్నారు.

 

 

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హిందుత్వం పై ఉన్న ప్రేమ ఆప్యాయతలు నిరుపేద ప్రజలపై లేదని తొమ్మిదేళ్ల పాలనలో నిత్యవసర సరుకులు గ్యాస్, పెట్రోల్ డీజిల్ పై, పెనుబారం మోపి ప్రజల రక్తం పీల్చుతున్నారని వారు ఆవేదన వ్యక్తపరిచారు.

 

ప్రభుత్వ ప్రైవేటు సంస్థలను ఆదాని అంబానీలకు కట్టబెట్టి దేశాన్ని మరింత దివాలా తీపించారని ఆవేదన వ్యక్తపరిచారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రాధాన్యతలిస్తూ కోట్లాది రూపాయలను దోచుకొని దాచుకున్నారన్నారు.

 

నీళ్లు నిధులు నియామకాలు పక్కనబెట్టి రాష్ట్రంలో గడీల పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షేనిచాయని హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో ఉన్నారా లేరా అనే విషయం కూడా ప్రజలకు అర్థం కావడం లేదన్నారు.

 

అన్ని శాఖల పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెత్తనం చెలాయిస్తూ నియంత పాలన కొనసాగిస్తున్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్నికి మరోసారి ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్నారన్నారు.

 

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నమ్మే పరిస్థితులలో లేరని కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికలే రుజువు చేశాయన్నారు. రేపు తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ, బిజెపి పార్టీలు కనుమరుగు కావడం ఖాయం అన్నారు.

 

తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పీపుల్స్ మార్చి పాదయాత్రకు ప్రజల నుండి ఎంతో స్పందన ఉందని ఊరురా ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పేద మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు నియోజకవర్గ ముఖ్య నాయకులు నేతలు కార్యకర్తలు యువజన సంఘాల నాయకులు విద్యార్థి సంఘ నాయకులు మహిళా సంఘాల నాయకులు సంఘీభావం చేస్తున్నారన్నారు.