Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

పిడుగుపాటుకు పశువులు మృతి

పిడుగుపాటుకు పశువులు మృతి

కంగ్టి , మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎల్లారేగడి తండాలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంలో చలి పిడుగుపాటుకు వ్యవసాయ రైతు కుటుంబానికి చెందిన బన్యా నాయక్,
&ధర్మానాయక్, ఎద్దు, మృతి చెందడం జరిగింది.

 

 

నానక్ రావ్, నారాయణ, ఆవు, మృతి చెందగా స్థానిక సర్పంచ్ బలరాం,తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అకాల వర్షం కురవడంతో తాండ సమీపంలోనే ఇద్దరు వ్యవసాయ రైతుల ఎద్దు ఆవు మృతి చెందగా ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదన్నారు.

 

వీటి విలువ ఎద్దు 80000 వేల రూపాయలు ఆవు విలువ 60 వేల రూపాయలు ఉంటుందని అన్నారు. వీరికి ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని అన్నారు.

 

కంగ్టి మండల పరిధిలోని జమ్గి కే గ్రామానికి చెందిన గైని గౌతమి,భర్త సాయిలు,జీవన ఉపాధి కొరకు గోర్లు మేపుతుండగా పిడుగుపాటుకు ఒక గొర్రె మృతి చెందగా గౌతమి, తీవ్ర అస్వస్థతకు గురికాగా స్థానికులు హుటాహుటిన బాన్సువాడ ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారని స్థానిక సర్పంచ్ ప్రగతి రాజు పాటిల్,ఎంపీటీసీ రుక్మిణి బాయి అంబాజీ, తెలిపారు.

 

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బీద కుటుంబానికి చెందిన వీరికి ప్రభుత్వం సాయం అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు