పోడు పట్టాలపై కీలక ప్రకటన చేసిన.. మావోయిస్టు పార్టీ ఆజాద్..!

పోడు పట్టాలపై కీలక ప్రకటన చేసిన.. మావోయిస్టు పార్టీ ఆజాద్..!

చర్ల, మనసాక్షి :

అటవీ హక్కుల చట్టం-2006 కేంద్ర, రాష్ట్ర, పెసా 1996 చట్టాలను అమలు చేయించుటకై మిలిటెంట్ పోరాటాలు నడపండి అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట సోమవారం మావోయిస్టులు లేక విడుదల చేశారు.

 

ఆ లేఖలో పోడు భూముల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న ఆదివాసి, వలస ఆదివాసి పేద ప్రజలకు 12, 14, లక్షల మందికి పట్టాలిచ్చి రైతుబంధు, ఉచితంగా బోర్లు వేసి, ఉచిత విద్యుత్తు కల్పించాలని ఈ భూముల కట్ ఆఫ్ తేదీని పెంచాలని వలస ఆదివాసీలందరికీ భూమీ పట్టాలు,

 

ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇవ్వాలని ఆదివాసి గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలని విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని

 

ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పైన పేర్కొన్న సమస్యలు ప్రధాన డిమాండ్ గా ఉండాలని పరిష్కరించని ఎడల ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.

 

ALSO READ : 

1. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?

2. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!

3. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!