Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Police : పోలీస్ శాఖ పనితీరుకు డిజిపి ప్రశంస

పోలీస్ శాఖ పనితీరుకు డిజిపి ప్రశంస

సూర్యాపేట , మనసాక్షి

డిజిపి కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం నందు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కి రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ప్రశంసాపత్రం అందజేశారు.

గత కొంతకాలంగా జిల్లా పోలీస్ శాఖ మెరుగైన పనితీరును కనపరుస్తూ పోలీసు పని విభాగాలు కమ్యూనిటీ కార్యక్రమాలు, 5S అమలు, పెట్రో కార్, బ్లూ కోట్, డయల్ 100 కాల్స్ నిర్వహణ, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సమన్లు, వారెంట్, కోర్టు మానిటరింగ్, రోడ్డు భద్రత, పోలీస్,హెచ్ ఆర్ ఎం ఎస్ పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ నిర్వహణ, నందు ప్రతిభ చూపుతూ ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తుందన్నారు.

 

అలాగే దర్యాప్తులో ఉన్న కేసులను వేగంగా కోర్టుకు దాఖలు చేయడలో రాష్ట్రంలో జిల్లా పోలీసు ప్రతిభ, కేసుల్లో నేరస్తులకు శిక్షల అమలు, లోక్ అదాలత్ నందు కేసుల పరిష్కారం లో ప్రతిభ, అనుమానితుల వేలిముద్ర తనిఖీలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినదని తెలిపారు.

ALSO READ :

 

ఈ సందర్భంగా జిల్లా పోలీసులు సిబ్బంది పని తీరును,గుర్తించి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ని అభినందిస్తూ రాష్ట్ర డిజిపి మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం నందు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ అధికారులు అభినందనలు తెలిపినారు.

 

ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర అధికారుల సూచనల మేరకు సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు ఉత్తమ సేవలను అందిస్తుందని.

 

పోలీసు పని విభాగాలను సిబ్బంది అందరూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పలు విభాగాలలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడానికి సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. సిబ్బంది పారదర్శకంగా, సమర్ధతతో విధులు నిర్వర్తిస్తున్నారు అని తెలిపారు.

మరిన్ని వార్తలు