కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు..!

అశ్వారావుపేట మండలంలోని కొత్త నారంవారిగూడెం గ్రామ శివారులోని ఓ తోటలో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై శనివారం పోలీసులు దాడి చేశారు.

కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు..!

దమ్మపేట,మార్చి 09 మన సాక్షి :

అశ్వారావుపేట మండలంలోని కొత్త నారంవారిగూడెం గ్రామ శివారులోని ఓ తోటలో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై
శనివారం పోలీసులు దాడి చేశారు.

ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 9, 800 నగదుతో పాటు 10 పందెం కోడి పుంజులు, నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.ఐ శ్రీరాముల శ్రీను తెలిపారు. పట్టుబడినవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ALSO READ : Telangana : నాడు తొడగొట్టి.. నేడు కాళ్ళ బేరం..!